free travel తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో క్లౌడ్ నైన్‌లో మహిళలు
Women on cloud nine with the launch of free travel in RTC buses in Telangana
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ప్రారంభమయ్యాయి.
శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు బాలికలు, విద్యార్థులు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు.
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో క్లౌడ్ నైన్‌లో మహిళలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు బాలికలు, విద్యార్థులు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లలో మహిళలతో మహాలక్ష్మి పథకాన్ని అధికారులు ప్రారంభించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచిత టిక్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఉచిత ప్రయాణంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. నేటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ప్రాంగణానికి తరలివచ్చారు.
పేద, మధ్యతరగతి మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా సులువుగా అమలు చేసేలా మార్గదర్శకాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉచిత బస్సు సౌకర్యాన్ని కలెక్టర్ అనుదీప్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్లు ఇచ్చారు. అనంతరం బస్సులో ప్రయాణించారు. సిద్దిపేటలో మహాలక్ష్మి పథకాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించారు. ములుగు, మహబూబాబాద్, కరీంనగర్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకంతో ప్రతి ఇంటికి కనీసం రూ.3 వేలు ఆదా అవుతుందని మహిళలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలాంటి పాస్‌లు లేకుండానే ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి లభించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా మహిళలు పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. మహాలక్ష్మి పథకంపై ఆర్టీసీ అధికారులు ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిచ్చి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.