EPFO ఖాతాలో వడ్డీ డబ్బులు చెక్ చేసుకోవాలా?..ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో EPF ఖాతాలో వడ్డీ మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. చాలా మంది EPF సభ్యులు ఇప్పటికీ వడ్డీ మొత్తం కోసం వేచి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో సభ్యులు తమ EPF ఖాతాలో వడ్డీ మొత్తం వచ్చిందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. మీరు మీ EPF ఖాతా బ్యాలెన్స్‌ని సులభంగా చెక్ చేసుకునే కొన్ని మార్గాలను మనం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. వినియోగదారులు వెబ్‌సైట్, యాప్ ద్వారా బ్యాలెన్స్‌ని సులభంగా తనిఖీ చేయవచ్చు. ఇది కాకుండా.. SMS ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ నాలుగు పద్ధతుల ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాచో తెలుసుకుందాం.
1. UMANG యాప్ నుండి బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోండిలా
1. మీరు మీ ఫోన్‌లో UMANG యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
2. దీని తర్వాత మీరు యూజర్ ఐడి, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి.
3. లాగిన్ అయిన తర్వాత యాప్‌లో ‘వ్యూ పాస్‌బుక్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. ఇప్పుడు మీ బ్యాలెన్స్ స్క్రీన్‌పై చూపబడుతుంది. ఇందులో మీరు అన్ని డిపాజిట్ల తేదీ, మొత్తాన్ని కూడా తనిఖీ చేయవచ్చు.
2. EPFO సభ్యుల పోర్టల్ నుండి బ్యాలెన్స్ తనిఖీ చేసుకోండిలా
1. మీరు EPFO వెబ్‌సైట్‌కి వెళ్లి ఉద్యోగుల విభాగాన్ని ఎంచుకోవాలి.
2. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత, ‘సభ్యుని పాస్‌బుక్’కి వెళ్లండి.
3. దీని తర్వాత PF వివరాలను తనిఖీ చేయడానికి మీరు UAN నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
4. ఇప్పుడు మీ PF పాస్‌బుక్ స్క్రీన్‌పై చూపబడుతుంది.
3. మిస్డ్ కాల్స్
మీరు మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు UAN రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్‌లో మీ బ్యాలెన్స్ మీకు తెలుస్తుంది.
4. SMS
మెసేజ్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని కూడా EPFO కల్పించింది. సందేశం ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి మీరు ‘UAN EPFOHO ENG’ అని వ్రాసి 7738299899కి సందేశాన్ని పంపాలి. దీని తర్వాత సమాధానంలో బ్యాలెన్స్ మీకు తెలుస్తుంది.
Keywords:
epf withdrawal online
online pf withdrawal online
pf amount withdraw online
pf money withdraw online
epfo online pf withdrawal process
pf pension withdrawal process online
epfo online pf withdrawal process
pf advance withdrawal process
pf procedure withdrawal