కొత్త రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లపై తీపి వార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డ్ కోసం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా కొత్తవారికి రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రజాపలన దరఖాస్తులో కొత్త రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికె దరఖాస్తులు అందుకున్నది. కాగా ఇప్పుడు వాటిని జారీ చేసే దిశగా అడుగులేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం..ఆరు గ్యారెంటీలు మాత్రమే అని చెప్పవచ్చు. అయితే, గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు జారీ చేసే దశగా అడుగులు వేస్తూ దానితోపాటు రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఇవ్వాలని యోచిస్తోంది.
ఈ సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రాష్ట్ర ప్రజలకు తీపి వార్త చెప్పారు. అదేంటంటే?..రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఆసరా పెన్షన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. కాగా, మరో రెండు మూడు రోజుల్లో మంత్రివర్గం సమావేశం జరగనుందని ఆ భేటీలో రేషన్ కార్డులు ఆసరా పింఛన్లపై చర్చించి రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందిస్తామని తెలిపారు.
అయితే, దేశంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఆసరా పింఛన్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టామని పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీలను రోజురోజుకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని చెబుతున్నారు.
కాగా, ఇటీవల ఖమ్మం జిల్లాల తిరుమల నిర్వహించిన సభలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ..కొత్త రేషన్ కార్డులపై అదే విధంగా ఆసరా పింఛన్లపై రాబోయే రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతామని అన్నారు. అంతేకాకుండా..వీటిని అమలు చేసే బాధ్యత కూడా తనే తీసుకుంటానని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం గతంలో ప్రజా పాలన కార్యక్రమం పెట్టిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో ఎక్కువగా ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానికి ముఖ్య కారణం..గతంలో ఎప్పుడూ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసే విధంగా అడుగులు వేస్తోంది.
ఇప్పటికీ రేషన్ కార్డు లేని వారు రెవెన్యూ అధికారి వద్దకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ జారీ చేస్తామని అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డ్ ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు సమాచారం.