Rythu Bharosa: దసరా పండుగ వేళ.. రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లోకి రూ.15 వేలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీలను నెరవేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే, ఆరు ప్రధాన గ్యారెంటీల అమలును మొదలుపెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు మొదలైన వాటిని అమలు చేస్తోంది.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, పంట రుణమాఫీని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా, రైతుల ఖాతాల్లో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ నిధులను జమ చేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో రుణమాఫీ అమలు కాకపోవడంతో, కొన్ని ప్రాంతాల రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి, అర్హులైన రైతులకు నిధులు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎన్నికల ముందు, కాంగ్రెస్ పార్టీ ‘రైతుబంధు’ పథకాన్ని ‘రైతుభరోసా’ పథకంగా మార్చి, రైతులకు రూ. 10 వేల పెట్టుబడి సాయాన్ని రూ. 15 వేలకుగాను పెంచుతామని ప్రకటించింది. కౌలు రైతులకు కూడా ఈ సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. రైతు కూలీలకు ఎకరానికి రూ. 12,000 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించింది. కానీ, ఈ పథకం అమలులో ఆలస్యం కావడంతో విమర్శలు ఎదుర్కొంటోంది.
Rythu Bharosa: On the occasion of Dussehra festival.. Huge good news for farmers.. Rs. 15 thousand in the accounts..
ప్రస్తుతం, రైతుభరోసా పథకానికి మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఈ వానాకాలం సీజన్ నుంచే కొత్త నిబంధనలతో ఈ పథకాన్ని ప్రారంభించనుందని మంత్రులు చెప్పారు. వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సారి పంటలు వేసిన రైతులకే రైతుభరోసా పథకం అమలు చేయనున్నామని స్పష్టం చేశారు. దసరా పండుగ నాటికి ఈ పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం, కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తే, ప్రతి రైతుకు గతంలో కంటే రూ. 5,000 అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 1.52 కోట్ల ఎకరాల కోసం ప్రభుత్వం రూ. 22,800 కోట్లను కేటాయించనున్నట్లు అంచనా వేస్తోంది. కానీ, పథకాన్ని 5 ఎకరాలపైనే పరిమితం చేస్తే, 62.34 లక్షల మంది రైతులు మాత్రమే ఈ సాయం పొందగలుగుతారు.