Rythu Bharosa: పండగ వేళ రైతులకు భారీ శుభవార్త… అకౌంట్లోకి రూ.15 వేలు.. కీలక ప్రకటన..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, 6 ముఖ్యమైన గ్యారెంటీల అమలుకు ముందడుగు వేసింది. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సక్రమ విధానం పెంపు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి.
సహాయక చర్యలలో భాగంగా, రైతుల సంక్షేమానికి ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని ప్రకటించి, రైతులకు అండగా నిలవాలని తేల్చింది. ఈ నిర్ణయం ద్వారా రైతుబంధు పథకం స్థానంలో రైతుభరోసా పథకాన్ని ప్రారంభిస్తామని, పెట్టుబడి సాయాన్ని రూ.10 వేల పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామన్నారు. తెలిపింది. కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందించనున్నారని వెల్లడించింది. అంతేకాకుండా, రైతు కూలీలకు ఎకరాకు రూ.12,000 ఇస్తామన్నారు.
అయితే, రైతుభరోసా పథకాన్ని అమలు చేయడంలో ఆలస్యం జరిగినట్లు ఆరోపణలు రావడం జరిగింది. తాజాగా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఈ సారి రైతుభరోసా పథకాన్ని కేవలం పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తామని తెలిపారు. పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించనుంది.
రాష్ట్రంలో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు రూ.22,800 కోట్ల ఆర్థిక సాయం అందించబడుతుంది. కానీ, 5 ఎకరాలకు పరిమితం చేస్తే, 62.34 లక్షల మంది రైతులకు మాత్రమే ప్రభుత్వం మద్దతు ఇస్తుందని అంచనా. ఈ దశలో, ప్రభుత్వానికి సుమారు రూ.7,800 కోట్లు ఆదా అవుతుందని, ప్రతి రైతుకు గత ప్రభుత్వంతో పోలిస్తే రూ.5000 ఎక్కువ ఇవ్వబడుతుంది. రైతుభరోసా పథకాన్ని వచ్చే నెలాఖరులో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.