RTC Buses : ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్.. ఇకపై మగవాళ్లకు టికెట్ డబ్బుల బాధ లేదు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికుల సౌకర్యాలపై మరింత శ్రద్ధ పెడుతోంది. ప్రయాణంలో చిల్లర సమస్యలను తగ్గించేందుకు డిజిటల్ పేమెంట్ సౌకర్యాలను ప్రవేశపెట్టాలని సంస్థ చర్యలు చేపడుతోంది.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక, ఇతర ప్రయాణికులు టికెట్ చెల్లింపుల్లో చిల్లర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, TSRTC హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్ మరియు బండ్లగూడ డిపోలకు చెందిన బస్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, త్వరలోనే అన్ని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. ఇకపై బస్సుల్లో ప్రయాణించేందుకు గూగుల్ పే, ఫోన్‌పే, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా టికెట్ ధరలను సులభంగా చెల్లించవచ్చు.
అదనంగా, ప్రస్తుత కండక్టర్ల చేతిలో ఉన్న టిమ్ మిషన్ల స్థానంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టం మిషన్లను అందించే దిశగా ఆర్టీసీ ప్రయత్నిస్తోంది, దీని ద్వారా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులకు పోటీని పెంచే అవకాశం ఉంది.