ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు..వెంటనే ఇలా అప్లై చేసుకోండి..!
జాతీయ సామాజిక అభ్యున్నతి, ఉపాధి ప్రాతిపదికన దేశంలోని వెనకబడిన అణగారిన వర్గ పౌరుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. పీఎం సూరజ్ పోర్టల్ (https://sbms.ncog.gov.in)ను ప్రధాని నరేంద్ర మోదీ 13 మార్చి 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అణగారిన పౌరులు రుణాలు పొందవచ్చు. ఈ కొత్త జాతీయ పోర్టల్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య కార్మికులు సహా దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు రుణ సహాయం లభిస్తుంది. ఆ రుణం ఎలా పొందాలో ఈ వార్త ద్వారా చూద్దాం.
PM సూరజ్ పోర్టల్ పథకం అనేది సామాజిక అభ్యున్నతి, ఉపాధి ఆధారిత, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేసిన ఒక జాతీయ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా అణగారిన వర్గాలకు రుణ సహాయం లభిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు సులభంగా రుణాలు పొందగలరు. దీని కోసం వారు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా రుణం పొందగలుగుతారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి.
ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ లక్ష్యం:
షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అర్హులైన వ్యక్తులకు రుణ సహాయం అందించడం పీఎం సూరజ్ పోర్టల్ ప్రధాన లక్ష్యం. తద్వారా సమాజంలోని అత్యంత అణగారిన వర్గాలు డెవలప్ అవుతాయి. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా అణగారిన అదేవిధంగా దళిత వర్గ పౌరులకు దాదాపు రూ.1లక్ష వరకు రుణాలు ఇవ్వడంతోపాటూ.. రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు. అయితే, లోన్ పొందడానికి అర్హులైన పౌరులు తమ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పిఎమ్ సూరజ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని లోన్ పొందొచ్చు.
ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రధాన అంశాలు:
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పీఎం సూరజ్ పోర్టల్ పూర్తి పేరు.. ప్రధాన్ మంత్రి సామాజిక ఉద్ధరణ ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమం (PM SURAJ). ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ జిల్లాల నుంచి మొత్తం 3 లక్షల మంది యువత ఈ పోర్టల్‌లో చేరారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ కింద దేశంలోని దాదాపు లక్ష మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.720 కోట్లు జమ చేశారు. ఈ పోర్టల్‌లో వివిధ పథకాలు కూడా ఉన్నాయి. అందులో గృహనిర్మాణం, పెన్షన్, రేషన్, బీమా మొదలైనవి.
రుణం పొందేందుకు అర్హతలు:
ప్రధాన్ మంత్రి సూరజ్ పోర్టల్ ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తుదారు ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు ప్రయోజనాలను పొందేందుకు అర్హులుగా ఉండడం విశేషం. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి ఎలాంటి అర్హతా నిర్దేశించలేదు. దరఖాస్తుదారును ఏ బ్యాంకూ.. రుణం ఎగ్గొట్టిన వ్యక్తిగా ప్రకటించకూడదు. ఈ పోర్టల్‌లో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రమే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
PM సూరజ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థి కొన్ని అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, వ్యాపార సంబంధిత పత్రాలు, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇమెయిల్ ఐడి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా మీరు అధికారిక పోర్టల్ https://sbms.ncog.gov.in లోకి వెళ్లాలి. తర్వాత మీరు సైన్ అప్ బటన్ క్లిక్ నొక్కాలి. తర్వాత మీరు మీ రాష్ట్రం పేరు, దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, సైన్ అప్ పూర్తి చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని మీరు నమోదు చేసి ధృవీకరించాలి. దాంతో మీ సైన్ అప్ పూర్తైనట్లే. తర్వాత మీరు లోన్ కోసం అప్లై ఫర్ లోన్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ ముందు దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో అనేక వివరాలు అనగా మీ పేరు, లోన్ రకం, సివిల్ స్కోర్, బ్యాంక్ ఖాతా నంబర్ వంటి సమాచారం ఇవ్వాలి. తర్వాత కోరిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు రుణం మంజూరవుతుంది. లోన్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది.