1 జూన్ 2024 నుండి కొత్త నిబంధనలు..సామాన్యుడి జేబుపై ప్రభావం చూపిస్తుందా..?
ప్రతి నెల మొదటి తేదీన చాలా ముఖ్యమైన విషయాలలో చాలా మార్పు ఉంటాయి. ఈసారి కూడా జూన్ 1 నుండి చాలా విషయాలు మారబోతున్నాయి. వీటిలో వంటగది నుండి ప్రయాణం వరకు అన్నీ ఉండడం విశేషం. ఇవి దాదాపు ప్రతి వ్యక్తి జేబుపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతాయి. కాగా, జూన్ లో వచ్చే ఈ మార్పుల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
1. LPG సిలిండర్ ధర
జూన్ 1 నుంచి డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు ఉంటుంది. వాస్తవానికి దేశంలో ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది. ఈ మార్పు చమురు మార్కెటింగ్ కంపెనీలచే చేయబడుతుంది. గృహ, వాణిజ్య సిలిండర్‌లకు వర్తిస్తుంది. అయితే, ధరలో మార్పు అవసరం లేనప్పటికీ..ధరలకు సంబంధించిన నవీకరణలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వబడతాయి.
2. డ్రైవింగ్ కేసుల్లో జరిమానాలు
డ్రైవింగ్‌లో తప్పులు చేస్తే వివిధ రకాల జరిమానాలు ఉన్నాయి. మైనర్ (18 ఏళ్లలోపు) డ్రైవింగ్ చేస్తుంటే..ఈ సందర్భంలో కూడా అతనికి భారీ జరిమానా విధించబడుతుంది. జూన్ 1 నుంచి ఇది కూడా మారనుంది. మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే దాదాపు రూ.25,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అతనికి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ కూడా లభించదు అని తెలుసుకోవాలి.
3. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా డ్రైవింగ్ పరీక్షలు
జూన్ 1 నుంచి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో (డ్రైవింగ్ స్కూల్స్) కూడా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించవచ్చు. ఇప్పటి వరకు ఆర్టీఓ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ కేంద్రాల్లోనే ఈ పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు కూడా డ్రైవింగ్ పరీక్షను కలిగి ఉంటారు. లైసెన్స్ జారీ చేస్తారు. అయితే, ఈ పరీక్ష RTO ద్వారా అధికారం పొందిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రమే నిర్వహించబడుతుంది.
4. అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తే జరిమానా
అతివేగంతో వాహనం నడిపితే..మరింత జరిమానా విధిస్తారు. జూన్ 1 నుంచి మారుతున్న ట్రాఫిక్ రూల్స్‌లో ఈ నిబంధన కూడా ఉంది.
రూల్స్ ని కాదని అతి వేగంతో వాహనం డ్రైవ్ చేస్తే..రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా చెల్లించాలి. అంతే కాదు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే..రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
5. జూన్‌లో ఇవి కూడా ప్రధాన అప్‌డేట్‌లు
మీరు మీ ఆధార్ కార్డ్‌లో ఏదైనా అప్‌డేట్ చేయాలనుకుంటే..మీరు జూన్ 14 వరకు దాన్ని ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ అప్‌డేట్‌లు ఆన్‌లైన్‌లో చేయగలిగే వాటికి మాత్రమే సంబంధించినవి. ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తే..ఒక్కో అప్ డేట్ కు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా జూన్‌లో 10 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇందులో 6 వారపు సెలవులు కూడా ఉన్నాయి.