జీవన్ ప్రమాణ్ పత్ర..ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేయొచ్చు..ప్రాసెస్ ఇదే!
మీరు కూడా పెన్షన్ ప్రయోజనం పొందినట్లయితే..జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించే సమయం ఆసన్నమైంది. ప్రతి సంవత్సరం పింఛనుదారులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని (జీవన్ ప్రమాణ్ పాత్ర) నవంబర్‌లోగా సమర్పించాలి. సూపర్ సిటిజన్లు లేదా సీనియర్ సిటిజన్లు అనారోగ్యంతో ఉండి బ్యాంకు లేదా పెన్షన్ కార్యాలయానికి రాలేని వారు ఇంట్లో కూర్చొని కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ద్వారా పెన్షనర్లు సులభంగా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చని గత సంవత్సరం EPFO తెలియజేసింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే పూర్తి ప్రక్రియను మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి
EPFO అందించిన సమాచారం ప్రకారం..పెన్షనర్లు కొన్ని దశలను అనుసరించడం ద్వారా సులభంగా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఇప్పుడు అవేంటో ఒకసారి చూద్దాం.
1. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్‌ఫేస్‌ఆర్‌డి లేదా జీవన్ ప్రమాణ్ ఫేస్‌యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
2. ఈ యాప్‌లకు లాగిన్ అయిన తర్వాత..పెన్షనర్ తన ముఖాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది.
3. ఇప్పుడు ఫేస్ స్కాన్ తర్వాత..అన్ని వివరాలను పెన్షనర్‌కు ఇవ్వాలి.
4. దీని తర్వాత పెన్షనర్ మళ్లీ ఫోన్ ముందు కెమెరా నుండి ఫోటోను క్లిక్ చేయాలి.
5. ఫోటోను క్లిక్ చేసిన తర్వాత, ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది.
6. ఫోటో విజయవంతంగా సమర్పించిన తర్వాత..లైఫ్ సర్టిఫికేట్ సమర్పించబడుతుంది.
పింఛనుదారులు తమ బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీసు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానించబడి ఉండాలని గుర్తుంచుకోవాలి.
లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం?
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశాయి. నవంబర్ 30వ తేదీలోపు పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుంటే డిసెంబరు నుంచి పెన్షన్ ప్రయోజనం పొందలేరు. జీవిత ధృవీకరణ పత్రం. దీని ద్వారా పెన్షనర్ బతికే ఉన్నాడా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ధారిస్తుంది.