రైల్వ లో భారీ ఉద్యోగాలు..అర్హత, ఫీజులు, పూర్తి వివరాలివే!
రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే 12వ తరగతి ఉత్తీర్ణులైన యువకుల కోసం ఇది ఒక ముఖ్యమైన వార్త అని చెప్పవచ్చు. RRB NTPC అండర్గ్రాడ్యుయేట్ స్థాయి రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే ఆసక్తిగల అభ్యర్థులు, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. కాగా, ఈ నోటిఫికేషన్ కు ఆన్‌లైన్ లో అప్లై చేసుకునేందుకు చివరి తేదీ 20 అక్టోబర్ 2024గా నిర్ణయించారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?
ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు..కొన్ని పోస్టులకు అభ్యర్థులకు హిందీ/ఇంగ్లీష్ టైపింగ్ పరిజ్ఞానం కూడా ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 18 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయస్సు 33 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇస్తారు. కాగా, వయస్సు జనవరి 1, 2025 నాటికి లెక్కించబడుతుంది.
నియామక వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 3445 పోస్టులను నియమించనున్నారు. ఇందులో కమర్షియల్-టిక్కర్ క్లర్క్‌కు 2022, రైలు క్లర్క్‌కు 72, అకౌంట్స్ క్లర్క్-టైపిస్ట్‌కు 361, జూనియర్ క్లర్క్-టైపిస్ట్‌కు 990 పోస్టులు రిజర్వు చేయబడ్డాయి.
దరఖాస్తు రుసుము
దరఖాస్తు ఫారమ్‌ను పూరించడంతో పాటు..అభ్యర్థులు నిర్ణీత రుసుమును కూడా డిపాజిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ ని ఓకే చేస్తారు. జనరల్/ OBC/ EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 500 గా ఉంది. SC/ ST/ PH/ మహిళా అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. టైర్-1 పరీక్ష తర్వాత రూ.400 జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వాపసు చేయబడుతుంది. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళ అభ్యర్థులకు పూర్తి రీఫండ్ చేయబడుతుంది. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాలి.