కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
సామాన్యులకు ఈ వార్త భారీ ఊరట అని చెప్పవచ్చు. అదేంటని అనుకుంటున్నారా?..అయితే మీరు ఈ విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇటీవల కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇళ్లు వంటి అంశాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో ఈ కధనం ద్వారా తెలుసుకుందాం.
రాష్టంలోని ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే సొంత ఇల్లు కట్టుకోవడం కోసం చాలా వేచి చూస్తున్నారు. ఈ అంశంపై మంత్రి తాజాగా కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. రేషన్ కార్డుల జారీపపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
లోక్ సభ ఎన్నికలు అవ్వగానే కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతేకాకుండా కొత్త ఇళ్ల మంజూరు అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గానికి సుమారు 3500 ఇల్లను మంజూరు చేస్తామని తెలిపారు. పదేళ్ల తెలంగాణ విభజన హామీలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమలు చేయలేదని ఈ ప్రచారంలో భాగంగా అయన విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మరో వైపు రేషన్ కార్డుల ఇకేవైసీ జరుగుతోంది. దీనికోసం కుటుంబ సభ్యులు అందరూ వేలిముద్రలు ఇస్తున్నారు. రేషన్ దుకాణాలకు వెళ్లి వేలిముద్రల పని పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మంది మాత్రమే ఈ- కేవైసీ పూర్తి చేసినట్లు అధికారుల నుంచి అందిన సమాచారం. అయితే, మరో 26 శాతం మంది వేలిముద్రలు ఇచ్చి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతూ వచ్చిన పౌర సరఫరాల శాఖ అధికారులు..ఇక ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా మిగిలిన 26 శాతం మంది బయోమెట్రిక్ పూర్తిచేసుకోవాలని రేషన్ షాపులకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.
కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత..బోగస్ రేషన్ కార్డులను తొలగిస్తారు. అందువల్ల మీ పేరు రేషన్ కార్డులో ఉంటే మాత్రం కచ్చితంగా బయోమెట్రిక్ పూర్తి చేసుకోండి. ఈ కేవైసి చేయని వారు వీలైనంత త్వరగా వేలిముద్రలు ఇవ్వాలని పలు చోట్ల గ్రామాల్లో ఉండే రేషన్ ఇచ్చే డీలర్లు చెబుతున్నారు. కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డు నుంచి పేరును తొలగించే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు.
అందువల్ల కార్డులో పేరున్న ప్రతి కుటుంబ సభ్యుడు మీ మీ బయోమెట్రిక్ పూర్తి చేసి ఆధార్ సంఖ్యతో రేషన్ కార్జు అనుసంధానం చేసుకోవాల్సిన సమయమిది. ప్రస్తుతం ఈ- కేవైసి పూర్తి చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా మిస్ కాకుండా అందుకునే ఛాన్స్ ఉంటుందని గుర్తించుకోవాలి.