మహిళలకు గుడ్ న్యూస్..ఇలా చేస్తే మీ ఖాతాలో ఏకంగా రూ. 32 వేలు..!!

Telugu Vidhya
3 Min Read

మహిళలకు గుడ్ న్యూస్..ఇలా చేస్తే మీ ఖాతాలో ఏకంగా రూ. 32 వేలు..!!

దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువస్తూనే ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక పథకాలు అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలను తీసుకువచ్చింది. ఇటువంటి పథకాలలో మహిళలకు చాలా ఉపయోగకరమైన ఒక పథకం కూడా ఉంది.  అందులో మహిళలు 32 వేల వరకు డబ్బులు పొందవచ్చు. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని గత ఏడాది 2023 ఏప్రిల్ 1న అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోయిన ఏడాది బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ఫిక్స్డ్ డిపాజిట్ పథకం. ఈ పథకంలో దాదాపు వెయ్యి రూపాయల నుండి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే..ఇది అధిక వడ్డీ రేటును కలిగి ఉండడం విశేషం. అయితే, వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. అంతే కాకుండా మరింత ఖచ్చితమైన లాభాలను కూడా పొందవచ్చు. ఈ పథకం రెండు సంవత్సరాల తరువాత పరిపక్వం చెందుతుంది. ఒకవేళ అవసరమైతే మధ్యలో కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. ఏ వయసులో ఉన్న బాలికల పేరు మీదగాని, లేదా మహిళల పేరు మీదగాని ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీరు మీ దగ్గర్లో పోస్టాఫీసుకు వెళ్లి ఖాతా తెరవాలి.

మైనర్ బాలికపై గార్డియన్ ఖాతా తెరవవచ్చు. ఈ పథకం కోసం ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, కలర్ ఫోటో మొదలైనవి డాక్యుమెంట్లు అవసరం. నిబంధనల ప్రకారం.. మీరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్లో పెట్టుబడి పెడితే..మీరు ఒక సంవత్సరం తర్వాత కొంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఈ  సమయంలో డిపాజిట్ చేసిన మొత్తంలో  దాదాపు 40 శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు చూస్తే ఒకవేళ మీరు 2 లక్షలు జమ చేస్తే.. మీరు దానిలో 80 వేలను ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకంలో 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. రెండేళ్లలో రూ. 8,011 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 58, 011 పొందుతారు.

 అంతేకాకుండా  మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో లక్ష డిపాజిట్ చేస్తే.. వడ్డీ కింద రూ. 16, 022 పొందుతారు. అంటే రెండు సంవత్సరాల తరువాత మొత్తం మొత్తం రూ. 1,16,022 పొందవచ్చు. మీరు ఒక లక్ష 50 వేల డిపాజిట్ చేస్తే.. రెండు సంవత్సరాల తరువాత రూ. 24, 033 వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మొత్తం మొత్తం రూ. 1,74,033 అందుకుంటారు. మీరు ఈ పథకంలో 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు 32,044 రూపాయల వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తం 2,32,044 రూపాయలు అందుతాయి. ఇతరులకు డబ్బులు వడ్డీకి ఇస్తే 2 లక్షలు తిరిగి ఇస్తారో లేదో కూడా తెలియదు. కానీ మీరు ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బుకు హామీ ఇవ్వబడుతుంది. అయితే ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి కేవలం మార్చి 31,2025 నాటి వరకు మాత్రమే  సాధ్యమవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *