తెలంగాణ రైతులకు శుభవార్త.. త్వరలో రుణమాఫీ..!!
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో అనేక పథకాల గురుంచి హామీ ఇచ్చింది. ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ.. వరుసపెట్టి పథకాలు అమలులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..ఇప్పుడు రైతుల మంచి కోసం ఆలోచన చేస్తున్నామన్నారు. త్వరలో రైతు రుణమాఫీపై ఆయన శ్రద్ద ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. తెలంగాణ అన్నదాతల శ్రేయస్సుకు గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్న రేవంత్ సర్కార్.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు అనేక సభలో హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణ మాఫీ పక్క చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని అయన తెలిపారు. అయితే, లోక్ సభ ఎలక్షన్ కోడ్ కారణంగా..తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం రుణాలను మాఫీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టంగా కసరత్తులు షురూ చేసింది.
ఈ మేరకు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తోందట. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాగానే..ఈ మార్గదర్శకాలను రిలీజ్ చేసి..రుణమాఫీ అర్హతలపై క్లారిటీ ఇవ్వాలని భావిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలోని కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని..రెన్యువల్ చేసుకోలేదు. వారికి మాఫీ వర్తిస్తుందా? అలాగే ఒక్క కుటుంబంలో ఎంత మందికి రుణమాఫీ వర్తింపజేస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని బ్యాంకర్లను కోరింది.
మరోవైపు..రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కసరత్తులు ఇప్పటికే షురూ చేశారట. రుణ మాఫీ చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణపై కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పంట రుణాల జాబితాలను తయారు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అతి త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నది. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కార్ చెబుతుండటం రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఎంతో సంతోష పెడుతోంది. ఆరు గ్యారంటీల అమలుపై కార్యచరణ సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కార్.. ఇప్పటివరకు అమలు చేయని పథకాలపై విధివిధానాలు రెడీ చేస్తోంది. కాగా, లోక్ సభ ఎలక్షన్స్ పూర్తికాగానే..పెండింగ్ లో ఉన్న పథకాలపై ఓ క్లారిటీ రానుంది.