Free Train Journey: రైల్వేలో ఉచిత ప్రయాణం..టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు…
రైలు టికెట్ నిబంధనలు: ప్రయాణానికి సంబంధించిన సమాచారం
విదేశాలకు ప్రయాణం చేయడానికి మనం ఎక్కువగా విమానాలను ఉపయోగిస్తాము, కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు రైళ్ల సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, చాలామంది రైళ్లలోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.
రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. గతంలో, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అందుబాటులో లేకపోయినప్పుడు, స్టేషన్‌కు వెళ్లి, క్యూ లో నిల్చొని టికెట్ పొందాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం డైరెక్ట్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా ఇతర యాప్‌ల ద్వారా ఇంటి నుంచే టికెట్ బుక్ చేసుకోవచ్చు. జనరల్ టికెట్లను రైలు రాకకు 10 నిమిషాల వరకు కూడా బుక్ చేసుకోవచ్చు.
రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. గతంలో, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అందుబాటులో లేకపోయినప్పుడు, స్టేషన్‌కు వెళ్లి, క్యూ లో నిల్చొని టికెట్ పొందాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం డైరెక్ట్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా ఇతర యాప్‌ల ద్వారా ఇంటి నుంచే టికెట్ బుక్ చేసుకోవచ్చు.జనరల్ టికెట్ తీసుకునే క్రమంలో కూడా 12 ఏళ్లలోపు పిల్లలకు సగం టికెట్ తీసుకుంటే సరిపోతుంది.
రైలు టికెట్ నిబంధనలను తెలియక కొంతమంది చిన్న పిల్లలకు లేదా వృద్ధులకు టికెట్లు కొనుగోలు చేస్తారు. కొన్ని సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు; వారు ఉచితంగా ప్రయాణించవచ్చు.
4 ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా ప్రయాణించవచ్చు, కానీ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సమయంలో వారి వివరాలు ఇవ్వాలి. 5 నుండి 12 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సగం టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక బెర్త్ అవసరమైతే, పూర్తి టికెట్ తీసుకోవాలి. జనరల్ టికెట్ కొనుగోలులో కూడా 12 ఏళ్లలోపు పిల్లలకు సగం టికెట్ చెల్లించాల్సి ఉంటుంది .