Free Ration: రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన మోదీ.. ఉచితంగా రేషన్ పంపిణీ..
Free Ration: దేశంలోని రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. మరోసారి ఉచితంగా రేషన్ అందిచబోతున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ కార్డు దారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పేదలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రస్తుతం అందిస్తోన్న మరో పథకం గడువును మరి కొన్ని సంవత్సరాలు పెంచుతున్నట్లు తెలిపింది.
సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ అందిస్తూ “ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన” పథకాన్ని పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పేద ప్రజలకు మేలు జరగనుంది.
Free ration: Modi gave good news to the ration card holders.. Free ration distribution..
ఈ నిర్ణయానికి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు. దాంతో 2028 వరకు పేదలకు ఉచిత రేషన్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద విటమిన్లు కలిపిన ఫోర్టిఫైడ్ రైస్‌ను తెల్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం ప్రభుత్వం అందిస్తోంది.
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం ₹17,082 కోట్ల రూపాయల వ్యయం విడుదల చేయబోతుంది. దేశంలో మహిళలు, పిల్లల్లో రక్తహీనత, విటమిన్ల లోపం ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్‌లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ₹4,406 కోట్ల వ్యయంతో సరిహద్దు రోడ్ల అభివృద్ధిపై నిర్ణయాలు వెల్లడించారు.