అదిరిపోయే స్కీమ్.. ఇలా చేస్తే చేతికి రూ.2 లక్షల 30 వేలు!
ఎవరైనా డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఈరోజుల్లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లేదంటే సేవింగ్ స్కీమ్స్, బ్యాంక్ ఎఫ్‌డీలలో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. రిస్క్ తీసుకోవాలనుకునేవారు వారు స్టాక్ మార్కెట్ వైపు ఇంటరెస్ట్ చూపొచ్చు. లేదంటే మాత్రం బ్యాంకులు, పోస్టాఫీస్ వంటి వాటిల్లో అందుబాటులో ఉంటే సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు దాచుకోవచ్చు. బ్యాంక్, పోస్టాఫీస్‌లో కూడా పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీకు నచ్చిన పథకాన్ని ఎంచుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా పథకం ఎంపిక ఉండాలనే అంశాన్ని మరువొద్దు.
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అదిరే పథకాన్ని తెచ్చింది. ఇది పోస్టాఫీస్‌లో, ఇటు బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. అందువల్ల మీరు ఎక్కడికైనా వెళ్లి ఈ పథకంలో జాయిన్ అవ్వొచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు లేదా బాలికల పేరిట 2 సంవత్సరాల సమయానికి గాను దాదాపు రూ. 2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తారు. గత ఏడాది 2023లో ప్రారంభించిన ఈ పథకం రెండేళ్ల పాటు అనగా వచ్చే ఏడాది మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యంగా మహిళా ఇన్వెస్టర్లను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఈ పథకంలో డిపాజిట్ చేసిన వారు ఏడాదికి 7.5 శాతం స్థిర వడ్డీ అందుకుంటారు. ప్రతి 3 నెలలకోసారి వడ్డీ లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఈ మొత్తం ఖాతాలో జమవుతుంది. ఈ పథకంలో మహిళలు ఎవరైనా చేరే వీలు కల్పించారు. చేసే పనితో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా ఈ పథకంలో చేరి ఈ పథకం లబ్ది పొందవచ్చు. అందువల్ల డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఈ స్కీమ్ వైపు చూడొచ్చు.
ఉదాహరణగా తీసుకుంటే..ఈ సేవింగ్స్ పథకంలో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే..మొదటి త్రైమాసికం తర్వాత..రూ.3,750 వడ్డీని పొందుతారు అందుకుంటారు. ఈ మొత్తం మళ్లీ రీఇన్వెస్ట్ అవుతుంది. రెండో త్రైమాసికం చివరిలో రూ.3,820 వడ్డీని అందుకుంటారు. ఈ మొత్తం కూడా తిరిగి ఇన్వెస్ట్ అవుతుంది. ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బాండ్ మెచ్యూర్ అయినప్పుడు, ఇన్వెస్టర్లు మొత్తం రూ.2,32,044 అందుకుంటారు. అంటే రెండేళ్ల కాలంలో వడ్డీ రూపంలోనే మీరు రూ. 32 వేలకు పైగా సొంతం చేసుకోవచ్చు.అందువల్ల డబ్బులు దాచుకోవాలని భావించే మహిళలు ఈ పథకం గురించి తెలుసుకోవడం ఉత్తమం. రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి వస్తుంది. ఒకేసారి రెండు లక్షలు పెట్టడం కష్టమని భావిస్తే.. మీకు నచ్చిన మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుకోవచ్చు.