సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండొచ్చో తెలుసా?..ఒకవేళ లిమిట్ దాటితే?..
ఇటీవల రోజుల్లో బ్యాంకు అకౌంట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంతోనే కాకుండా టెలికాం రంగంలో పెరిగిన టెక్నాలజీతో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా పొందడం చాలా సులభంగా అయిపోయింది. అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుండడంతో బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు దోచుకుంటారు అనే భయం కారణంగా బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేస్తూ ఉంటారు ప్రజలు.
ఈ నేపథ్యంలో సాధారణంగా అందరికీ ఓ అనుమానం ఉంటుంది. అసలు మన బ్యాంక సేవింగ్స్ ఖాతాలో ఎంత డిపాజిట్ చేయవచ్చు? డిపాజిట్ పరిమితి ఎంత? అనే అనుమానం అందరికీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలో? ఎంత డిపాజిట్ చేయవచ్చో? ఓ సారి ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
ఒకవేళ మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే..సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దాదాపు మీ యొక్క ఆదాయ వివరాలను అడిగే అవకాశం ఉంది. వారు మీ సమాధానంతో ఒప్పుకోకపోతే, చెందకపోతే దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక వేళ విచారణలో డిపాజిట్ చేసిన అమౌంట్ పట్టుబడితే..60 శాతం సొమ్మును సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు జరిమానా కింద వసూలు చేసే అవకాశం ఉంది.
పొదుపు ఖాతాలో సొమ్మును పొదుపు చేసేందుకు ఎలాంటి పరిమితి లేదు. కానీ, ఓ ఆర్థిక సంవత్సరంలోనేదాదాపు రూ.10 లక్షల కంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్ చేస్తే..ఆ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు తెలియజేయాల్సి ఉంటుంది . అయితే, మీరు పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము ఆదాయపు పన్ను పరిధిలోకి దానికి సంబంధించిన సమాచారం, వివరాలు ఆదాయపు పన్ను శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆదాయ వనరుల వివరాలను కూడా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.
మన దేశ జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలకు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. భారతదేశంలో యూపీఐ రాకతో డిజిటల్ పేమెంట్స్ వాడకం సంఖ్య గణనీయంగా పెరిగింది అని తెలుసు. ముఖ్యంగా దేశంలో చిల్లర సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పవచ్చు. మీ పొదుపు ఖాతాలో ఎక్కువ మొత్తంలో డబ్బును దాచిపెట్టుకోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కచ్చితంగా డబ్బును ఖాతాల వంటి సురక్షిత మార్గాల్లో ఉంచాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చెబుతున్నారు.