పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మారిన నిబంధనలు..వాటిని లింక్ చేయాల్సిందేనా..?
పోస్టాఫీసులో ఉండే చిన్న పొదుపు పథకాలులో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి వడ్డీని అందిస్తాయి. అంతేకాకుండా మీ డబ్బు కూడా వీటిలో భద్రంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు పోస్టాఫీసులోని చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇదే కారణం అని చెప్పవచ్చు. వీటిలో పెట్టుబడి మరియు రాబడితో పాటు పెట్టుబడి నిబంధనలు కూడా భిన్నంగా ఉండవచ్చు. కానీ, ఒక నియమం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అదే పాన్-ఆధార్ సమాచారాన్ని అందించడం.
నిబంధనలలో ఏమి మారాయి?
గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏదైనా పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టాలంటే..తప్పనిసరిగా పాన్, ఆధార్ సమాచారాన్ని అందించాలి. పేరు లేదా పుట్టిన తేదీ వంటి ఈ రెండింటి మధ్య ఏదైనా తేడా ఉంటే..మీరు పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టలేరు అని గుర్తించుకోవాలి.
పాన్ ధ్రువీకరణ కోసం..కోర్ బ్యాంక్ సొల్యూషన్ (CBS) సిస్టమ్ ప్రొటీన్ ఇ-గవర్ టెక్నాలజీస్ (గతంలో NSDL)తో అనుసంధానించబడింది. ప్రొటీన్ ప్రక్రియ నుండి అందుకున్న వివరాల ఆధారంగా..ఫినాకిల్‌లో PAN చెల్లుబాటు అవుతుంది. అయితే, తాజాగా పోస్టాఫీసు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. మే 1, 2024న పాన్ వెరిఫికేషన్‌కు సంబంధించిన ప్రొటీన్ సిస్టమ్ సవరించబడింది.
పోస్టాఫీసు వివరాలు వెరిఫై చేస్తుంది
పోస్టాఫీసు ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖతో కస్టమర్ల వివరాలను నిర్ధారిస్తుంది. ఈ క్రాస్ చెక్ యొక్క ఉద్దేశ్యం పాన్ మరియు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిందా లేదా అనేది తెలుసుకోవడమే. అంతేకాకుండా దీని ద్వారా కస్టమర్ యొక్క ఆధార్ పేరు మరియు పుట్టిన తేదీ సరిపోలుతున్నాయా లేదా అనేది కూడా తనిఖీ చేయబడుతుంది. రెండు వివరాలు సరిపోలకపోతే..కస్టమర్ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టకుండా నిరోధించబడవచ్చు.
పాన్-ఆధార్ లింక్ లేకపోవడం వల్ల కలిగే నష్టాలు
మీరు ఇంకా మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకుంటే.. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి త్వరగా పూర్తి చేయండి. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందవు. మీరు బీమా, మ్యూచువల్ ఫండ్స్ లేదా మరే ఇతర స్కీమ్‌లో పెట్టుబడి పెట్టలేరు. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినట్లయితే.. దాని వాపసు కూడా మీ ఖాతాకు రాదు.