డిగ్రీ లో అప్రెంటిస్ పోస్టులు..ఉచితంగా దరఖాస్తు చేసుకోండిలా!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) తాజాగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌లో ITI, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది, దరఖాస్తును అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ద్వారా ఫిల్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు 30 సెప్టెంబర్ 2024 చివరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు
SAIL మొత్తం 356 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి:
ట్రేడ్ అప్రెంటీస్: 165 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటీస్: 135 పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 53 పోస్టులు
అర్హత మరియు వయోపరిమితి
ట్రేడ్ అప్రెంటీస్: సంబంధిత ట్రేడ్‌లో ITI పూర్తి చేయాలి.
టెక్నీషియన్ అప్రెంటీస్: ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: BE/B.Tech డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 28 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ పోర్టల్ లేదా NATS పోర్టల్‌లో ముందుగా రిజిస్టర్ కావాలి. రిజిస్ట్రేషన్ అనంతరం అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేసి దరఖాస్తు పూర్తి చేయవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు ఎలాంటి దరఖాస్తు రుసుము అవసరం లేదు. పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.