అదిరిపోయే ఆఫర్..రూ.40 వేల స్మార్ట్‌టీవీని కేవలం రూ.7,500 కే కోనేయండి..!!
కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా?..అయితే కిర్రాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. కళ్లుచెదిరే తగ్గింపుతో ఒక స్మార్ట్ టీవీ అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మీరు మీ ఇంట్లోకి మంచి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే..ఈ ఆఫర్ పరిశీలించొచ్చు. ఇంకా తక్కువ ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు.
ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే డీల్ అందుబాటులో ఉంది. 40 ఇంచుల స్మార్ట్ టీవీ తక్కువ ధరకే వస్తోంది. ప్రముఖ టీసీఎల్ కంపెనీకి చెందిన ఐఫాల్కన్ బ్రాంక్ 40 ఇంచుల స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్ నడుస్తోంది. ఇప్పుడు మనం ఈ టీవీ రేటు ఎంత? ఎంతకు వస్తోంది? ఆఫర్లు ఏంటివి? అనే వంటి అంశాలు ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 38,990గా ఉంది. అయితే, మీరు ఇప్పుడు దీన్ని కేవలం రూ. 14,990కే కొనొచ్చు. అంటే మీకు నేరుగా ఈ టీవీపై దాదాపు 61 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ తగ్గింపులు మాత్రమే కాకుండా ఇతర చాలా ఆఫర్లు కూడా ఉన్నాయి. అందులో క్రెడిట్ కార్డు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి ఈ స్మార్ట్ టీవీ మీద ఏకంగా రూ. 1,250 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే అప్పుడు మీరు ఈ స్మార్ట్ టీవీని రూ. 13,740కు కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఈ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఏకంగా రూ. 7,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే మీకు రూ. 7,500కే ఈ స్మార్ట్ టీవీ వచ్చినట్లు అవుతుంది. అయితే, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..ఎక్స్చేంజ్ డీల్ అనేది మీ పాత టీవీ ఆధారంగా ఉంటుంది. అందువల్ల ఎక్స్చేంజ్ డీల్ అనేది మారొచ్చు. తక్కువ విలువ కూడా రావొచ్చు. అప్పుడు చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది.
ఈ టీవీపై నెలవారీ ఈఎంఐ రూ. 727 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 18 నెలల టెన్యూర్ ఎంచుకుంటే..నెలకు రూ. 936 పడుతుంది. ఇక 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1346 చెల్లించాలి. 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1800 వరకు పడుతుంది.
కాగా, ఈ స్మార్ట్ టీవలో ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి పలు రకాల యాప్స్ వీక్షించవచ్చు. అయితే, వీటి సబ్‌స్క్రిప్షన్ మీ వద్ద ఉండాలి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పని చేస్తుంది. సౌండ్ ఔట్ పుట్ 24 వాట్.