తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వీటిపై టెన్షన్ లేదు!

Telugu Vidhya
2 Min Read
విద్యార్థులకు

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వీటిపై టెన్షన్ లేదు!

పోయిన ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకు ముఖ్య కారణం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే అని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. తరువాత రూ.500 కే సిలిండర్ అందిస్తోంది. ఈ విధంగా ప్రజా సంక్షేమంపై పూర్తి ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు హామీలు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు వేస్తోంది. తాజాగా విద్యార్థులకు అదిరిపోయే వార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

ఫీజు రియంబర్స్మెంట్

సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ మీద కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది నుంచి ఎలాంటి పెండింగ్స్ లేకుండా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేస్తామని తెలిపారు. అయితే దేశంలో తొలిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

ఇటీవల ఓ విద్యా యజమాన్యం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విషయంలో నిర్లక్ష్యం వహించమని, ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అందజేస్తామని తెలిపారు. ఈ విధంగా విద్యార్థులు కాలేజ్ యజమానులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.

ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరం నుండి ఎలాంటి బకాయిలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని సీఎం నిర్ణయించారు. బకాయిలు కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేలా మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

విద్యా రంగం

ప్రభుత్వ పథకాల మీదనే కాకుండా విద్యా రంగంలో కూడా తన మార్క్ కనపడేలా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులపై దృష్టి పెట్టారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ప్రణాళికలు తయారు.

తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డు అందించాలని, అదేవిధంగా విద్యార్థులకు 20 వేల లోపు లభించే లాప్టాప్ లను అందించాలని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే పలుచోట్ల మూతబడిన పాఠశాలలను తెరుస్తామని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు, తాండకు ఒక బడి ఉండేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు క్వాలిటి ఎడ్యుకేషన్ అందించాలని ఆయన కృషి చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *